KL Rahul: ఓటమిని జీర్ణించుకోలేకపోయిన లక్నో సూపర్ జెయింట్స్ బాస్.. స్టేడియంలో కేఎల్ రాహుల్‌పై చిందులు.. వీడియో ఇదిగో!

LSG boss Sanjiv Goenka fires on KL Rahul after defeat here is video
  • హైదరాబాద్ చేతిలో దారుణ పరాభవం
  • డగౌట్‌లోనే రాహుల్‌పై విరుచుకుపడిన సంజీవ్ గోయెంకా
  • లైవ్ టెలికాస్ట్ అయిన వైనం
  • ఇది సరికాదని హితవు పలికిన కామెంటేటర్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ దారుణంగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమైన కేఎల్ రాహుల్ సేన ఆరో ఓటమిని మూగట్టుకుంది. లక్నో నిర్దేశించిన 165 పరుగుల విజయ లక్ష్యాన్ని హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే ఛేదించింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన లక్నో యజమాని సంజీవ్ గోయెంకా కోపంతో ఊగిపోయారు. ఎల్ఎస్‌జీ డగౌట్ వద్ద కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై విరుచుకుపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది లైవ్‌లో టెలికాస్ట్ కావడంపై కామెంటేటర్లు కూడా స్పందించారు. స్టేడియంలో చుట్టూ బోల్డన్ని కెమెరాలు ఉన్నాయని, ఇలాంటివి ఏమైనా ఉంటే గదిలో చర్చించుకోవాలని, ఇలా బహిరంగంగా విరుచుకు పడిపోవడం తగదని హితవు పలికారు. సంజీవ్ గోయెంకా అంతగా అరుస్తున్నా రాహుల్ మాత్రం కూల్‌గానే ఉన్నాడు. ఏదో చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన వినిపించుకోకపోవడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటన తర్వాత రాహుల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు కూడా దూరమయ్యాడు.

హైదరాబాద్‌లో ఓడిన లక్నో ప్లే ఆఫ్ల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 12 మ్యాచ్‌లు ఆడి ఆరింటిలో గెలిచిన లక్నోకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ రెండిటిలోనూ గెలిస్తే కొంతవరకు అవకాశాలు ఉండే చాన్స్ ఉంది. అయితే అది ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది. ఓడితే కనుక ఇంటి ముఖం పట్టక తప్పదు.

  • Loading...

More Telugu News